డ్రగ్స్ కేసులో ఈ నగరానికి ఏమైంది సినిమా హీరో ?

-

కేపీ డ్రగ్స్ లిస్ట్ లో హీరో సుశాంత్ రెడ్డి…పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ఈ నగరానికి ఏమైంది సినిమాలో హీరోగా నటించిన సుశాంత్ రెడ్డి…ఈ కేసులో చిక్కుకున్నారు. ప్రశాంత్ రెడ్డి, సుశాంత్ రెడ్డితో పెద్ద మొత్తంలో కాల్స్ మాట్లాడాడు నిర్మాత కేపీ చౌదరి. దీంతో సుశాంత్ రెడ్డి ఆర్థిక లావాదేవులపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే హీరో సుశాంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు.

నాకు కేపీ చౌదరి ఒక ప్రొడ్యూసర్ గా మాత్రమే తెలుసు అని.. కొన్ని సార్లు కలిశాను.. అప్పుడపుడు కాల్స్ మాట్లాడానని వివరించారు. నాకు డ్రగ్స్ అలవాటు లేదు. డ్రగ్స్ పరంగా ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. మా మధ్య ఆ టాపిక్ కూడా రాలేదు. ఎలాంటి టెస్ట్ కి అయినా రెడీ.. అని తేల్చి చెప్పారు. పోలీసుల నుంచి ఎదైనా కాల్ వస్తుందని ఎదురు చూస్తున్నా.. ఎలాంటి విచారణ కు అయినా సిద్ధమన్నారు. పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో నా ఫోన్ నెంబర్ ఎలా పెడతారు.. నాకు నిన్నటి నుంచి వందల కాల్స్ వస్తున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version