బెలారస్‌ సైన్యానికి వాగ్నర్‌ దళం ట్రైనింగ్

-

రష్యాపై తిరుగుబాటు ప్రయత్నం చేసిన తర్వాత బెలారస్ తో వాగ్నర్ గ్రూపునకు ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ అవగాహనలో భాగంగా బెలారస్‌ చేరుకున్న వాగ్నర్‌ దళం ఆతిథ్య దేశ సైన్యానికి శిక్షణను ప్రారంభించింది. పోలండ్‌ సరిహద్దులకు సమీప ప్రాంతంలో సంయుక్త యుద్ధ ట్రైనింగ్ షురూ అయింది. వారం రోజుల పాటు కొనసాగే ఈ విన్యాసాల్లో తమ ప్రత్యేక సైనిక బలగాలు పాల్గొంటాయని బెలారస్‌ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

బెలారస్‌లో ఆశ్రయం పొందుతున్న వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత ప్రిగోజిన్‌ తొలిసారి బహిరంగ ప్రదేశాల్లో కనిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఒకటి వాగ్నర్‌ గ్రూప్‌ అనుకూల టెలిగ్రామ్‌ ఛానళ్లలో ప్రత్యక్షమైంది. కొన్ని శాటిలైట్‌ దృశ్యాలు, సామాజిక మాధ్యమ వీడియోల ప్రకారం కొందరు వాగ్నర్‌ యోధులు ఓ కాన్వాయ్‌లో మంగళవారం బెలారస్‌లో అడుగుపెట్టినట్లు సమాచారం. మరో రెండు కాన్వాయ్‌లు కూడా బెలారస్‌లో వారికి కేటాయించిన ఓ సైనిక స్థావరానికి వెళ్తున్నారని, మొత్తం పది వేల మంది వరకూ ఉండవచ్చని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version