పుతిన్ త్వరలోనే చనిపోతాడు.. జెలెన్​స్కీ సంచలన కామెంట్స్

-

గత మూడేళ్ల నుంచి రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఇరు దేశాలకు సంబంధించి సైన్యం పెద్ద ఎత్తున మరణించింది. ఈ యుద్ధంలో లక్షలాది మంది పౌరులు మృతిచెందారు. అయినా ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్‌ను ఉద్దేశిస్తూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌ త్వరలో చనిపోతారని, అప్పుడే యుద్ధం ఆగిపోతుందని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. పుతిన్ త్వరలో చనిపోతారని.. అప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందని అన్నారు. ఈ యుద్ధం ఇంకా కొనసాగాలని రష్యా కోరుకుంటోందని తెలిపారు. త్వరలోనే ఇదంతా ముగిసేలా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రపంచ దేశాలను జెలెన్‌స్కీ కోరారు. ఇటీవలే పుతిన్ అనారోగ్యానికి గురయ్యారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జెలెన్ ​స్కీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news