రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకార దాడులు షురూ.. ధ్రువీకరించిన జెలెన్‌స్కీ

-

ఉక్రెయిన్​పై రష్యా దాడులపై ఆ దేశం ప్రతీకార దాడులు షురూ చేసింది. తాజాగా రష్యాపై ఉక్రెయిన్ భారీస్థాయిలో ఎదురుదాడి ప్రారంభించింది. డొనెట్స్క్‌, బఖ్‌ముత్‌ సహా పలు ప్రాంతాల్లో తమ దళాలు దూసుకుపోతున్నాయని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్​స్కీ తెలిపారు. ముఖ్యంగా బఖ్‌ముత్‌లో మాస్కో దళాలను వెనక్కి నెడుతున్నట్లు ప్రకటించారు. ఈ నగరాన్ని పూర్తిగా కైవసం చేసుకున్నామని గత వారం రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎదురుదాడిని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ధ్రువీకరించారు.

‘‘ఎదురుదాడులు, రక్షణాత్మక చర్యలు ప్రస్తుతం జరుగుతున్నాయి. అవి ఏ దశలో ఉన్నాయనే విషయంపై మాట్లాడను. అన్ని దిశల్లో ఉన్న మా సైనిక కమాండర్లతో నేను ప్రతి రోజు మాట్లాడుతున్నాను’’ అని తెలిపారు.

మరోవైపు ఉక్రెయిన్​ ఎదురుదాడి విఫలమైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నారు. కీవ్‌ దళాలను నిలువరిస్తున్నామని, అవి ముందుకు కదలడం లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version