సీఎం రేవంత్ రెడ్డిలో అసహనం పెరిగింది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం హోదాలో ఉన్న విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయారని విమర్శించారు. జర్నలిస్టులను జైలులో వేస్తాననడం సీఎం గర్వానికి నిదర్శనం అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. ఎవరెన్ని దుష్ప్రచారాలు ప్రజలు తమవైపే ఉన్నారని అన్నారు. ఇది చూశాకే సీఎం రేవంత్ రెడ్డిలో అసహనం పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు.

తిట్లు, కొత్త కొత్త అబద్దాల కోసం పరిశోధన బృందాలను రేవంత్ రెడ్డి నియమించుకున్నారని అన్నారు. దేశంలో శాంతి భద్రతలు కొనసాగాలంటే మరోసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం రావాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటేసిన తర్వాత ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులు వచ్చి దేశ ప్రజలను చంపేవారని.. ప్రధాని మోడీ హయాంలో ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెప్పారు. దేశంలో మత కలహాలు కావాలా? శాంతి కావాలా? అని కిషన్రెడ్డి ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version