ఐపీఎల్ 2020.. అన్ని అవార్డుల విజేత‌లు వీరే..!

-

దాదాపుగా 60 రోజుల పాటు కొన‌సాగిన ఐపీఎల్ 2020 వినోదం ఎట్ట‌కేల‌కు ముగిసింది. మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై ముంబై ఇండియ‌న్స్ గెలిచి చ‌రిత్ర సృష్టించింది. 5 సార్లు ట్రోఫీ గెలిచిన జ‌ట్టుగా రికార్డు నెల‌కొల్పింది. అయితే ఈ సీజ‌న్‌లో ప‌లు ఇత‌ర అవార్డుల‌ను గెలుచుకున్న ఆట‌గాళ్ల‌ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

1 ఎమ‌ర్జింగ్ ప్లేయ‌ర్ – దేవ‌ద‌త్త్ ప‌డిక్క‌ల్

రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ప‌డిక్క‌ల్ ఈ సీజ‌న్‌లో ఎంతో స‌ర్వీస్ అందించాడు. ఇత‌ను మొత్తం 15 మ్యాచ్‌ల‌లో 473 ప‌రుగులు చేసి ఎమ‌ర్జింగ్ ప్లేయ‌ర్ అవార్డును గెలుచుకున్నాడు.

2. ఫెయిర్‌ప్లే అవార్డ్ – ముంబై ఇండియ‌న్స్

ముంబై ఇండియ‌న్స్ ఈసారి ట్రోఫీని గెలుచుకోవ‌డ‌మే కాదు, ఫెయిర్ ప్లే అవార్డును కూడా కైవ‌సం చేసుకుంది. ట్రోఫీ గెలిచే స‌త్తాతోపాటు మైదానంలో జెంటిల్‌మెన్ల‌లా ప్ర‌వర్తించే నైజం మా సొంతం అని ముంబై ఇండియ‌న్స్ నిరూపించింది.

3. గేమ్ చేంజ‌ర్ ఆఫ్ ఐపీఎల్ – కేఎల్ రాహుల్

ఈ సీజ‌న్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ను ముందు వ‌రుస‌లో నిలిపేందుకు కెప్టెన్ కేఎల్ రాహుల్ విశ్వ ప్రయ‌త్నాలు చేసినా విఫ‌లం అయ్యాడు. కానీ బ్యాట్స్ మ‌న్‌గా స‌క్సెస్ సాధించాడు. బెంగళూరుపై రాహుల్ ఒక సెంచ‌రీ చేశాడు. అలాగే 14 మ్యాచ్‌ల‌లో 670 ప‌రుగులు చేశాడు.

4. సూప‌ర్ స్ట్రైక‌ర్ – కిరన్ పొల్లార్డ్

కిరన్ పొల్లార్డ్ మ్యాచ్ లో విజృంభిస్తున్నాడంటే ఆ రోజు అత‌ని టీం విజ‌యం సాధించిన‌ట్లే భావిస్తారు. పొల్లార్డ్ మొత్తం 16 మ్యాచ్‌ల‌లో 191.42 స్ట్రైక్ రేట్‌తో 268 ప‌రుగులు సాధించి సూప‌ర్ స్ట్రైక‌ర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

5. మోస్ట్ సిక్సెస్ ఇన్ ది సీజ‌న్ – ఇషాన్ కిష‌న్

ముంబై ఇండియ‌న్స్ ను అనేక మ్యాచ్‌ల‌లో విజ‌యాల బాట ప‌ట్టించిన వారిలో ఇషాన్ కిష‌న్ పేరు ముందుగా వినిపిస్తుంది. కిష‌న్ మొత్తం ఈ సీజ‌న్‌లో 30 సిక్స్‌లు బాదాడు.

6. ప‌వ‌ర్ ప్లేయ‌ర్ – ట్రెంట్ బౌల్ట్

ఐపీఎల్ ఫైన‌ల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు చెందిన కీల‌క వికెట్ల‌ను తీసిన బౌల్ట్ ముంబై విజ‌యంలో ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ఇత‌ను ఈ సీజ‌న్ కు గాను ప‌వ‌ర్ ప్లేయ‌ర్ అవార్డును సాధించాడు. ప‌వ‌ర్ ప్లేల‌లో ఇత‌ర జ‌ట్ల‌కు చెందిన కీల‌క వికెట్ల‌ను తీసి ముంబై విజ‌యాల్లో ఇత‌ను ముఖ్య పాత్ర పోషించాడు.

7. ప‌ర్పుల్ క్యాప్ – క‌గిసో ర‌బాడా

ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు చెందిన ఫాస్ట్ బౌల‌ర్ ఈ సీజ‌న్‌కు ప‌ర్పుల్ క్యాప్ సాధించాడు. మొత్తం 17 మ్యాచ్‌ల‌లో 30 వికెట్లు తీసి ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా రికార్డు సృష్టించాడు.

8. ఆరెంజ్ క్యాప్ – కేఎల్ రాహుల్

ఐపీఎల్ 2020 సీజ‌న్‌లో ఆరెంజ్ క్యాప్ కేఎల్ రాహుల్‌కు ద‌క్కింది. మొత్తం 14 గేమ్‌ల‌లో రాహుల్ 670 ప‌రుగులు చేసి ఈ సీజ‌న్‌కు అత్య‌ధిక ర‌న్స్ చేసిన ఆట‌గాడిగా పేరుగాంచాడు.

9. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయ‌ర్ – జోఫ్రా ఆర్చ‌ర్

ఐపీఎల్ 2020 సీజ‌న్ మొత్తానికి అత్య‌ధిక విలువ క‌లిగిన ఆట‌గాడిగా రాజ‌స్థాన్ ప్లేయ‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ అవార్డు సాధించాడు. ఇత‌ను మొత్తం 20 వికెట్లు తీశాడు. అలాగే ర‌న్స్ కూడా చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version