ఐపీఎల్‌లో కాసేపట్లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగనుంది. ప్లే ఆఫ్ అవకాశాలు ఇంప్రూవ్ చేసుకోవడమే టార్గెట్‌గా కోల్‌కతా, బెంగళూరు బరిలోకి దిగనున్నాయ్. టేబుల్‌లో తమ కంటే ఒక స్థానం ముందున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అమీతుమీ తేల్చుకోనుంది కోల్‌కతా నైట్ రైడర్స్.
సన్‌రైజర్స్‌పై సూపర్ విక్టరీ సాధించి రెట్టించిన ఉత్సాహంతో ఉంది కోల్‌కతా నైట్‌రైడర్స్. ప్లే ఆఫ్ అవకాశాలు ఇంప్రూవ్ చేసుకోవడమే టార్గెట్‌గా బరిలోకి దిగుతోంది. బెంగళూరుతో జరిగిన లాస్ట్ మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో ఓడిపోయింది కోల్‌కతా. ప్రస్తుతం 10 పాయింట్లతో టేబుల్‌లో నాలుగో ప్లేస్‌లో ఉన్న కోల్‌కతాకు ఆర్సీబీపై గెలవడం చాలా అవసరం. కోల్‌కతా బ్యాటింగ్‌లో నిలకడ లేదు. శుభమన్ గిల్, రాహుల్ త్రిపాఠి పరుగులు చేస్తున్నా.. దూకుడుగా ఆడటం లేదు. మోర్గాన్, దినేశ్ కార్తీక్‌లపైనే కోల్‌కతా బ్యాటింగ్ ఆధారపడి ఉంది. విండీస్ పవర్ హిట్టర్ రస్సెల్ ఇంతవరకు మెరుపులు మెరిపించలేదు. రస్సెల్ ఫామ్‌లోకి వస్తే కోల్‌కతా బ్యాటింగ్ కష్టాలు తీరుతాయ్. న్యూజిలాండ్ పేసర్ లూకీ ఫెర్గ్యూసన్ చేరికతో కోల్‌కతా బౌలింగ్ మరింత బలంగా తయారైంది.
మరోవైపు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించి మూడో ప్లేస్‌లో ఉంది ఆర్సీబీ. మరో విజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు మరింత దగ్గరవ్వాలని భావిస్తోంది కోహ్లీసేన. ఇంతవరకు టైటిల్ కొట్టిన కోహ్లీసేన ఈ సీజన్‌లో మంచి ఊపు మీద కన్పిస్తోంది. కోహ్లీ, డివిలియర్స్, ఫించ్ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఆర్సీబీ సొంతం. కానీ వీరిలో ఇద్దరూ వైఫల్యమైనా మ్యాచ్‌లో రాణించే వారే కరువయ్యారు. ఫస్ట్‌లో తడబడిన కోహ్లీ గత కొద్ది మ్యాచ్‌ల నుంచి అదరగొడుతున్నాడు. ఏబీ డివిలియర్స్ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆర్సీబీ బౌలింగ్ మాత్రం చాలా బలహీనంగా కన్పిస్తోంది. డెత్ బౌలింగ్‌లో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. అయితే క్రిస్ మోరిస్ రాకతో బౌలింగ్ స్ట్రాంగ్‌గా మారింది.