ఐపిఎల్ 2023: సూర్యకుమార్ విధ్వంసం ముందు 200 పరుగులు సరిపోలే … !

-

ముంబై మరియు బెంగళూరు జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సగం విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బెంగళూరు జట్టు నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో మూడు ఓవర్లు మిగిలి వుండగానే చేదించి ఘనంగా పాయింట్ల పట్టికలో 12 పాయింట్లు సాధించి గుజరాత్ టైటాన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ క తర్వాత స్థానంలో నిలిచింది. ముంబై చేదనలో ఇషాన్ కిషన్ (42) మొదటగా సిక్స్ లతో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగి మ్యాచ్ ను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేశాడు. చివరికి మరో 8 పరుగులు చేయాల్సిన సమయంలో ఔట్ అయ్యాడు.

సూర్య కేవలం 35 బంతుల్లో 7 ఫోర్లు మరియు 6 సిక్సులు సహాయంతో 83 పరుగులు చేసి విజయంలో కీలకంగా వ్యవహరించాడు. ఇతనికి యంగ్ ప్లేయర్ నేహల్ వధేరా నుండి చక్కని సహకారం లభించింది. ఇతను ఐపిఎల్ కెరీర్ లో వరుసగా రెండవ అర్ధ సెంచరీ (52) సాధించాడు. ఈ విజయం ముంబై కు ఎంత ముఖ్యమో తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version