కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 224 అసెంబ్లీ స్థానాలకు గాను 2,615 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ప్రధానంగా బిజెపి, కాంగ్రెస్, జేడిఎస్ ల మధ్య త్రిముక పోరు నెలకొంది. మొత్తం 5.31 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలుఉండగా…. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు. అధికారం కోసం బిజెపి, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా రంగంలోకి దిగగా… జెడిఎస్ మాత్రం కింగ్ మేకర్ గా నిలుస్తామనే ధీమాతో ఉంది. ఇక పోలింగ్ ముగిసాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అనుకూలంగా కొన్ని పోల్ సర్వేలు వెలువడ్డాయి.