ఐపీఎల్ 2023: కోహ్లీపై SRH మాజీ కోచ్ కీలక వ్యాఖ్యలు…

-

ఐపీఎల్ సీజన్ 16 చివరి దశకు చేరుకుంది. పది జట్లతో ప్రారంభం అయిన సీజన్ లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ కు చేరుకోగా, మిగిలిన 3 స్థానాల కోసం ఏడు జట్లు పోటీ పడుతున్నాయి. కాగా సన్ రైజర్స్ హైద్రాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ నిష్క్రమించాయి. తాజాగా సన్ రైజర్స్ హైద్రాబాద్ కు కోచ్ గా వ్యవహరించిన టామ్ మూడి బెంగుళూరు కీలక ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి సంచలన కామెంట్స్ చేశాడు. టామ్ మూడి ఒక ప్రకటనలో భాగంగా మాట్లాడుతూ కోహ్లీ ఏ జట్టులో ఆడినా, గెలుపు కోసం చివరి బంతి వరకు పోరాడుతాడని కితాబిచ్చారు. కాగా బెంగుళూరు జట్టు కూడా బాగానే ఆడుతోందని.. అయితే ఐపీఎల్ లో ఫస్ట్ హాఫ్ లో ఆడిన విధంగా సెకండ్ హాఫ్ లో ఆడలేక ఇబ్బందులను ఎదుర్కొంటోందన్నారు.

 

 

 

ఇప్పటి వరకు ఆ జట్టుభారాన్ని కోహ్లీ, డుప్లిసిస్ మరియు మాక్స్ వెల్ లే మోశారని.. జట్టు మొత్తం సమిష్టిగా ఆడితేనే విజయాలు సాధ్యం అవుతాయని పేర్కొన్నాడు. కాగా ఈ రోజు ఇంకాసేపట్లో హైదేరాబద్ వేదికగా బెంగుళూరు మరియు హైద్రాబాద్ జట్ల మధ్యన మ్యాచ్ జరగనుంది. ఇందులో బెంగుళూరు గెలిస్తేనే ప్లే ఆఫ్ కు అవకాశాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version