ఈ రోజు సాయంత్రం సరిగ్గా 4 .14 గంటలకు పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ లు నటిస్తున్న మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు BRO అనే టైటిల్ ను ఎంపిక చేశారు. వాస్తవంగా ఈ సినిమా తమిళ్ లో వచ్చిన వినోదయ సీతం కు రీమేక్. ఈ సినిమాను తమిళ విలక్షణ నటుడు సముథ్రఖని తెరకెక్కించనున్నాడు. ఈ మోషన్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ స్టైల్ గా నిలుచున్నా ఫోటో మరియు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన నేపధ్య సంగీతం అద్దిరిపోయింది. దీనితో పవన్ ఫ్యాన్ మాత్రమే కాకుండా.. ప్రేక్షకులు అందరూ ఎగబడి ఈ మోషన్ పోస్టర్ వీడియోను చూస్తున్నారు.
ఇరగదీశాడుగా: రికార్డులు సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ BRO మోషన్ పోస్టర్… !
-