ఇటీవలే హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ గుజరాత్ టీం నుండి కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఐదుసార్లు ముంబై కి ఐపీఎల్ ట్రోపీని అందించిన రోహిత్ ను కాదని హార్దిక్ పాండ్యా కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. దీనిపై ఫ్యాన్స్ మిశ్రమంగా స్పందించారు. ప్రస్తుతం ఒక వార్త ముంబై ఫ్యాన్స్ ని ఆందోళనకు గురిచేస్తుంది. రాబోయే ఐపీఎల్ సీజన్లో పాండ్యా ఆడకపోవచ్చు అని ఇంగ్లీష్ మీడియ కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్ లో హార్దిక్ పాండ్యా గాయపడిన సంగతి మనకు తెలిసిందే. దాంతో అతడు దక్షిణాఫ్రికా పర్యటనకు దూరం అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే టి20 సిరీస్ కి హార్థిక్ పాండ్యా అందుబాటులోకి రావచ్చని అందరూ భావించారు. కానీ గాయం తీవ్రత కారణంగా టి 20 సిరీస్ తో పాటు ఐపీఎల్ లో కూడా ఆడడం సందేహమేనని సమాచారం. పాండ్యా విషయంలో ఎలాంటి రిస్కు తీసుకోకూడదని బీసీసీ భావిస్తుంది ఐపీఎల్ ముగిసిన నెలలోపే టి20 ప్రపంచ కప్ మొదలు కాబోతుంది. ఒకవేళ రోహిత్ శర్మ ఈ టోర్నీ లో కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకుంటే హార్థిక్ పాండ్యే సారథ్యం వహించాల్సి ఉంటుంది. ఐపీఎల్ లో పాండ్య ఆడతాడా లేడా అనేది ముంబై టీం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.