IPL 2024 : విజృంభించిన నికోలస్ పూరన్ .. భారీ స్కోరు చేసిన లక్నో

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది.లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 214/6 స్కోరు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ను లంక పేసర్ తొలి ఓవర్‌లోనే దెబ్బకొట్టాడు. నువాన్ తుషార వేసిన మొదటి ఓవర్లో దేవదత్ పడిక్కల్ డక్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత పీయూష్ చావ్లా విజృంభణతో మార్కస్ స్టోయినిస్(28), దీపక్ హుడా(11)లు వెంటవెంటనే అవుట్ అయ్యారు. దీంతో లక్నో 69 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో కేఎల్ రాహుల్, నికోలస్ పూరన జోడి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు.నికోలస్ పూరన్ 29 బంతుల్లో 75 పరుగులతో విధ్వంసం సృష్టించారు.కాగా 15వ ఓవర్లో పూరన్ వరుసగా 3 సిక్సులు, ఒక ఫోర్ బాదారు. కేఎల్ రాహుల్ 55పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివర్లో కృనాల్ పాండ్య 12*, బదోనీ 22* రన్స్ చేశారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో నువాన్ తుషారా, పీయూష్ చావ్లా చెరో 3 వికెట్లు తీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version