హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 17వ మ్యాచ్ జరుగుతుంది.ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు తడబడ్డారు.హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.
ఇక చెన్నై ఓపెనర్స్లో రచన రవీంద్ర 9 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక మరో ఓపెనర్ గైక్వాడ్ 21 బంతుల్లో 26 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.
శివమ్ దూబే (24 బంతుల్లో 45), రహానె (30 బంతుల్లో 35) రాణించారు. తొలి 13 ఓవర్లలో 115 రన్స్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ .. ఆఖరి 7 ఓవర్లలో 50 పరుగులే చేసింది.భువీ, నట్టూ, ఉనాద్కత్, షాబాజ్, కమిన్స్ ఒక్కో వికెట్ తీశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 166.