రూ.100 కోట్లకు చేరువలో ‘టిల్లు స్క్వేర్’

-

సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా డీజె టిల్లు సినిమాతో ఈ యంగ్ హీరో ఫేమ్ సంపాదించుకున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న మూవీగా రిలీజయి భారీ విజయం సాధించింది.ఇక మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్‌. భారీ అంచనాలతో మార్చి 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్‌’కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది . బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా మొదటి వారంలో రూ.94 కోట్ల గ్రాస్ రాబట్టి రూ.100 కోట్ల క్లబ్కు చేరువైంది.

అనుపమ పరమేశ్వర న్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది.నేహా శెట్టి కీలకపాత్రలో నటించారు.ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. కాగా, ఈ చిత్రానికి కొనసాగింపుగా మరో సీక్వెల్ ను రూపొందిస్తామని ఇప్పటికీ హీరో సిద్దు జొన్నలగడ్డ వెల్లడించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news