ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది. దాంతో, అన్ని ఫ్రాంచైజీలు టైటిల్ వేట కోసం వివిధ వ్యూహాలను రచిస్తున్నాయి . ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ అసిస్టెంట్ కోచ్ గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ లాన్స్ క్లూసెనర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంచైజీ ప్రకటించింది. క్లూసెనర్ SAటీ20లో డర్బన్ సూపర్ జెయింట్స్కు హెడ్ కోచ్ గా ఉన్నారు.
ఈ జట్టు కూడా LSG ఫ్రాంచైజీదే కావడం విశేషం. కాగా క్లూసెనర్ సౌతాఫ్రికా తరఫున 49 టెస్టులు, 171 వన్డేలు ఆడారు. రెండు ఫార్మాట్లలో కలిపి 5,482 పరుగులతో పాటు 272 వికెట్లూ తీశారు.ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి పోరులో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.