టీడీపీలోకి గుమ్మనూరు జయరాం…ముహూర్తం ఫిక్స్

-

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఏప్రిల్ మాసంలో పార్లమెంటు ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంతోపాటు అభ్యర్థులను ఫైనల్ చేసుకుంటున్నాయి. ఇక మరి కొంతమంది టికెట్టు రాకపోవడంతో పార్టీలు కూడా మారుతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ టిడిపి పార్టీలో ఇద్దరు వైసీపీ ఎంపీలు అలాగే ఒక ఎమ్మెల్యే చేరనున్నారు.

Jayaram i tdp on march 5th

సార్వత్రిక ఎన్నికల మీద నాయకుల పార్టీల మార్పులు ఊపు అందుకున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ ముగ్గురు పార్టీని వీడుతున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హైదరాబాద్ లో టిడిపి చీఫ్ చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. నెల్లూరులో జరిగే టిడిపి సభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరుతారు. అలాగే పలనాడులో జరిగే సభలో శ్రీకృష్ణదేవరాయలు టిడిపి కండువా వేసుకోనున్నారు. ఇక అటు మార్చి 5వ తేదీన టీడీపీలోకి గుమ్మనూరు జయరాం వెళ్లనున్నారు. ఈ మేరకు ముహుర్తం ఫిక్స్‌ అయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version