IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య 28 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

సాయంత్రం మూడున్నర గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.కాగా, లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో మూడింట గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన నాలుగు మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతుంది.

 

కేకేఆర్ ప్లేయింగ్ ఎలెవన్ : సాల్ట్, సునీల్ నరైన్, రఘువంశీ, వెంకటేశ్, శ్రేయస్ అయ్య ర్, రమణ్ దీప్, రస్సెల్, హర్షిత్, స్టార్క్, వైభవ్, వరుణ్

 

లక్నో ప్లేయింగ్ ఎలెవన్ : డికాక్, రాహుల్, స్టోయినిస్, నికోలస్ పూరన్, హుడా, క్రునాల్ పాండ్య, బదోనీ, బిష్ణోయీ, మొహ్సీన్, షమార్, యశ్ థాకూర్

 

Read more RELATED
Recommended to you

Exit mobile version