IPL 2024 : మరో రెండు మ్యాచులకు లక్నో యంగ్ ప్లేయర్ దూరం!

-

తన అద్భుతమైన బౌలింగ్తో ఐపీఎల్-17లో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తు ,కీలక బ్యాటర్ల వికెట్లు తీసిన లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ మయాంక్ యాదవ్ మరో రెండు మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గంటకు నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో పాటు..ఖచ్చితత్వం కూడిన లైన్ లెంగ్త్ బంతులు వేయడం మయాంక్ స్పెషాలిటీ.ఇప్పటివరకు 3 మ్యాచ్లో ఆడిన మాయాంక్ యాదవ్ 6 వికెట్లను తీశాడు. రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన నిన్నటి మ్యాచ్ ఓటమి అనంతరం లక్నో కెప్టెన్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ పరిస్థితి దారుణంగా ఏమీ లేదన్నారు. వందశాతం ఫిట్నెస్ ఉంటేనే ఆడించాలని అనుకున్నట్లు చెప్పారు. మయాంక్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. మరో రెండు మ్యాచులకు అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొన్నారు. తిరిగి జట్టులోకి వస్తే అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడనే నమ్మకం ఉందని ఆశా భావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version