IPL 2024 : వర్షం కారణంగా నిలిచిన మ్యాచ్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతుంది. ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య 58వ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. 10ఓవర్లు ముగియగానే వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్ని నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. 10 ఓవర్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 3 వికెట్లు కోల్పోయి 119 రన్స్ చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(42), గ్రీన్(0) ఉన్నారు. కాగా.. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తప్పక గెలవాల్సి ఉంది. వర్షం తగ్గాలని బెంగళూరు అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version