ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ కొలకత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య 51వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే కేకేఆర్ ప్లే ఆప్స్ బర్త్ కన్ఫామ్ చేసుకుంది.. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన 9 మ్యాచ్లలో 6 గెలిచి రెండో స్థానంలో కొనసాగుతుంది.ఇటు ముంబై ఇండియన్స్ పాయింట్స్ టేబుల్ లో 9వ స్థానంలో ఉంది.ప్రతి మ్యాచ్లో భారీ స్కోర్ తేడాతో విజయం సాధించితే తప్పితే… ముంబైకి ప్లే ఆఫ్ ఛాన్సు లేదు. దీంతో ఇవాల్టి మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని ముంబై ఇండియన్స్ ఎంతో ఆత్రుతగా ఉంది.
ముంబై ప్లేయింగ్ ఎలెవన్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, టిమ్ డేవిడ్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార.
కోల్‌కతా ప్లేయింగ్ ఎలెవన్ : ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి.