ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ రసవత్తరంగా సాగుతుంది.ఈ సీజన్ లో పదుల సంఖ్యలో కొత్త ప్లేయర్లు తమ సత్తాను చాటుతున్నారు. కాగా కొంత మంది యువ ప్లేయర్లు కొన్నిసార్లు ఓవరాక్షన్ చేస్తూంటారు.ఈ క్రమంలోనే బీసీసీఐ మార్చిన రూల్స్ అలాంటి వారికి అడ్డుకట్ట వేస్తుంది.ఇందులో భాగంగానే కోల్‌కతా నైట్ రైడర్స్ యువ బౌలర్ హర్షిత్ రానా తీరు చర్చనీయాంశంగా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో సినియర్ ఆటగాడు అయిన మయాంక్ అగర్వాల్ ను అవుట్ చేసిన ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. దీంతో అతనికి మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించారు.
తాజాగా..ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులోను ఇలానే చేశాడు. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు తన ఒక మ్యాచ్ ఫీజు మొత్తం జరిమానా విధించడంతో పాటుగా ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించింది.