ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య 27 వ మ్యాచ్ జరిగింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆ టీమ్ ఓనర్ ప్రీతీ జింటా ఎక్స్ప్రెషన్స్ వైరల్ అవుతున్నాయి. ఆఖరి ఓవర్ వరకు విజయం ఇరు జట్లతో దోబూచులాడగా ఓ దశలో మ్యాచ్ గెలుస్తున్నామన్న ఆనందంలో ఆమె ఉత్సాహంతో సందడి చేశారు. ఆఖర్లో హెట్మెయర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. అప్పటి వరకు ఉత్సాహంగా కనిపించిన జింటా ఓటమితో నిరాశకు గురయ్యారు.
కాగా, చివరి వరకు కొనసాగిన ఈ మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 147 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19.5 బందుల్లో లక్ష్యాన్ని చేదించింది.