సీఎం జగన్ ను చంపాలని చూశారు: వెల్లంపల్లి శ్రీనివాస్

-

సీఎం జగన్పై జరిగిన దాడి నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జగన్ను చంపాలని కుట్ర చేశారు. ఆయనను అంతమొందిస్తేనే మనుగడ ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి భద్రత తగ్గించారు. పూర్తి విచారణ జరిపితే చంద్రబాబు బండారం బయటపడుతుంది అని అన్నారు. ఆయన ఎన్ని కుట్రలు పన్నినా జగనన్ను ఏమీ పీకలేరు’ అని వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

కాగా, నిన్న విజయవాడలో సీఎం జగన్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్నారు. కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటి దగ్గర గాయమైంది.రాయి బలంగా తగలడంతో కన్ను వాచింది. CMRF హరికృష్ణ గారు ఫస్ట్ ఎయిడ్ చేశారు .ఈ ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version