IPL 2024 : భారీ స్కోరు చేసిన SRH… డిల్లీ టార్గెట్ ఎంతంటే?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా సన్ రైజర్స్ ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓపెనర్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హెడ్, ఆ తర్వాత 32 బంతుల్లో 89 పరుగులు చేశాడు.ఇక మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 12 బంతుల్లో 46 రన్స్ చేశాడు. ఇక అభిషేక్ అవుట్ అయిపోయిన తర్వాత వచ్చిన మార్కరం 1, క్లాసన్ 15 పరుగులు చేశారు. ఒక దశలో 300 పరుగులు చేస్తుందని భావించిన అభిమానులు, టాప్ బ్యాట్స్మెన్ ఒకరి తర్వాత ఒకరు అవుట్ కావడంతో నిరాశ చెందారు.నితిన్ 37, సామద్ 13 పరుగులు చేశారు.ఇక చివర్లో అర్థ సెంచరీ తో రాణించాడు. దీంతో సన్రైజర్స్ భారీ స్కోర్ నమోదు చేయగలిగింది.ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ 4 వికెట్లు, ముకేశ్, అక్షర్ చెరో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version