ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆయుష్మాన్ భారత్- ఎన్టీఆర్ సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పాలసీతో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా వర్తింపజేసేలా ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినేట్. కొత్త మెడికల్ కాలేజీలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే… పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కళాశాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
అటు ప్రభుత్వంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. హోంమంత్రి, పౌరసరఫరాల, సమాచార, రెవెన్యూ శాఖల మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ నివారణకు చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది చంద్రబాబు కేబినేట్. దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.