IPL Auction : వికెట్ కీప‌ర్లపై కాసుల వ‌ర్షం.. ఇషన్ రూ.15.25, పూరన్ రూ. 10.75 కోట్లు

-

మెగా వేలంలో వికెట్ కీప‌ర్లపై ఫ్రొంఛైజీలు కాసుల వ‌ర్షం కురిపిస్తున్నాయి. రికార్డు ధ‌ర‌లో ఇషన్ కిషన్ ను ముంబాయి ఇండియన్స్ రూ. 15.25 కోట్లు వెచ్చించింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన వేలంలో ఇదే అత్య‌ధికం. అలాగే నికోలస్ పూర‌న్ ను స‌న్ రైజర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు రూ. 10.75 కోట్లు కుమ్మ‌రించింది.

అలాగే అంబాటి రాయుడిను చెన్నై సూప‌ర్ కింగ్స్ రూ. 6.75 కోట్లతో ద‌క్కించుకుంది. చెన్నైకు ఎంఎస్ ధోని కీప‌ర్ గా ఉన్నా.. భారీ ధ‌ర‌కు అంబాటి రాయుడిని ద‌క్కించుకుంది. అలాగే జానీ బెయిర్ స్ట్రో ను కూడా రూ. 6.75 కోట్ల‌కు పంజాబ్ కింగ్స్ ద‌క్కించుకుంది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన వేలంలో ప‌ది కోట్లకు పైగా ధ‌ర ప‌లికిన వారిలో ఇషన్ కిషన్ రూ. 15.25 తో మొద‌టి స్థానంలో ఉన్నాడు.

అలాగే శ్రేయ‌స్ అయ్యార్ రూ. 12.25 కోట్ల‌తో త‌ర్వాతి స్థానంలో ఉన్నాడు. వీరితో పాటు నికోల‌స్ పూరన్, హ‌ర్షల్ ప‌టేల్, హ‌విందు హ‌స‌రంగా ముగ్గురు కూడా రూ. 10.75 కోట్ల‌తో త‌ర్వాతి స్థానంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version