టెకీలకు త్వరలోనే బిగ్ షాక్ తగలనుంది. ఆర్టీఫిషీయల్ ఇంటెలిజన్స్ వాడకం వలన ఉద్యోగాలు పోతాయని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిని కొందరు సమర్థిస్తుండగా మరికొందరు మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఏఐ ద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతుందని మరికొందరు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ చేసిన ప్రకటన ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల గుండెళ్లో రైళ్లను పరిగెత్తిస్తున్నది.
2025లో మిడ్ లెవల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లను ఏఐతో భర్తీ చేస్తామని జుకర్ బర్గ్ ప్రకటించారు. ఇతర కంపెనీలూ ఇదే బాటలో నడుస్తాయని స్పష్టంచేశారు. ప్రస్తుతం మనుషులు చేస్తున్న కాంప్లెక్స్ కోడింగ్ టాస్కులను హ్యాండిల్ చేయగలిగే ఏఐ సిస్టమ్స్‌ను మెటా సహా టెక్ కంపెనీలు డెవలప్ చేస్తున్నాయని తెలిపారు. కోడ్ రాయగలిగే ఏఐని మోహరిస్తున్నామని మెటా సీఈవో తెలిపారు.