వెయ్యికి పది వేలు.. పది వేలుకు లక్ష..గోదావరి జిల్లాల్లో బెట్టింగ్ జోరు…!

-

ఇదీ గోదావరి జిల్లాలో సాగుతున్న IPL బెట్టింగ్‌ దందా..! బంతి బంతికీ బెట్టింగ్‌ వేస్తూ కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ఈ మాయా జూదంలో ఎంతో మంది బికారులౌతున్నారు. గతంలో గెలుపోటములపై మాత్రమే బెట్టింగులు కట్టేవారు. అయితే ప్రస్తుతం టాస్ వేసింది మొదలు ప్రతీ బంతికి, ప్రతీ ఓవర్ కు బెట్టింగ్ కడుతున్నారు. ఐపీఎల్ సీజన్ క్లైమాక్స్‌కు చేరుకోవడంతో పందాలు మరీ జోరందుకున్నాయ్‌. ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఇది సాగుతున్నా… పశ్చిమ గోదావరిలో మాత్రం హద్దులు దాటి గట్టు తెగుతోంది. సెమీ ఫైనల్, ఫైనల్ కు వెళ్లేది ఎవరంటూ వారం ముందు నుంచే లెక్కలు కడుతున్నారు.

ప్రతిరోజూ సాయంత్రం అయిందంటే చాలు కోట్ల రూపాయలు జిల్లాలో చేతులు మారుతున్నాయి.. పందాలు కాస్తున్నవారు బికారులుగా మారుతుంటే… నిర్వాహకులు మాత్రం 10 నుంచి 20 శాతం కమిషన్ వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు.అలాగే పోలీసులకు దొరక్కుండా వాట్సప్‌తో పాటు ఇతర యాప్‌లను వాడుతున్నారు. ఆధునిక పరిజ్ఞానంతో కోట్లలో వ్యాపారం సాగిస్తున్నారు. ఇలాంటి పందెంగాళ్లు విద్యార్ధులు, యువతనే టార్గెట్‌ చేస్తున్నారు. ఈ జూదంలో పడి అప్పులు చేసి చివరకు ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version