జగన్ సంగతి పక్కన… నిమ్మగడ్డకు ఇంతకంటే ఎవరు చెప్తారు?

-

స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి పెట్టితీరాలి అన్న రేంజ్లో ముందుకుపోతున్న ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు గట్టి దెబ్బే తగిలింది! అలా అని ఇదేదో జగన్ కొట్టారనో, కోర్టులు కొట్టాయనో కాదు సుమా.. ఎవరు కొట్టాలో వారు కొట్టారు అని చెప్పుకోవచ్చు! నేను ఒక్కడినే రాజు ని మిగిలిన వారు సైన్యం.. తన మాటే శాసనం అన్నట్లుగా ప్రవర్తిస్తున్న నిమ్మగడ్డకు ఏపీ ఎన్జీవో సంఘం గట్టి షాకే ఇచ్చింది!

ఏసీ గదిలో కూర్చుని.. కలిసే పది మందికోసం కూడా అనేక జాగ్రత్తలు తీసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు.. మిగిలిన ప్రభుత్వ ఉద్యోగస్తుల ఆరోగ్యంపట్ల కనీస ఆలోచన కూడా లేదా అనేది ఏపీ ఎన్జీవో సంఘం మాటగా ఉంది! అవును… ఏపీలో ఇంకా క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతూ ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు ఎన్నిక‌లు ఏమిట‌ని ప్ర‌శ్నిస్తోన్న ఏపీ ఎన్జీవో సంఘం… ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశాలు వ‌స్తే వాటిపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించింది!

ఈ పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఇది మామూలు దెబ్బ కదనేది విశ్లేషకుల మాటగా ఉంది! వాస్తవంగా ఆలోచించినా కూడా… ఎన్నికలు జరపమని ఈసీ ఆదేశించడం.. వద్దని రాజకీయ పార్టీలు చెప్పడం ఒక మాటతో పని.. ఆఫీసులో కూర్చుని పర్యవేక్షణతో కూడిన పని! కానీ… గ్రౌండ్ లెవెల్ లో విధులు నిర్వహించాల్సింది ప్రభుత్వ ఉద్యోగులే! మరి వారి ఆరోగ్యానికి ఎవరు బాధ్యులు?

మా మాట చెల్లితే చాలు, మా పంతం గెలిస్తే చాలు అని భావిస్తున్న పెద్దల ఈగోలకు ప్రభుత్వ ఉద్యోగులు బలికావాలా? వారిలో అన్ని వయసుల వారూ ఉంటారు? రిటైర్మెంట్ కు దగ్గరివారు కూడా ఉంటారు? వారు విధులు నిర్వహించకపోతే పని జరగదు. మరి వారి పరిస్థితి ఏమిటి? ఇవన్నీ పెద్ద కుర్చీల్లో కూర్చునేవారు కాస్త ఇంగితంతో ఆలోచించాలి కదా!! ఆలోచిస్తారులే ఇంక!!

Read more RELATED
Recommended to you

Exit mobile version