ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు షాాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు పడుతోంది. ఢిల్లీలో ఇద్దరు ఆటగాళ్లతో పాటు మరో నలుగురు సహాయక సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఆ జట్టుకు కరోనా గుబులు పట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రిషభ్ పంత్ వ్యవహార శైలిపై విమర్శలు వస్తున్నాయి. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఘటన విమర్శలకు తావిస్తోంది. అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. క్రీజ్ లో బ్యాటింగ్ చేస్తున్న బ్యాటర్లను డగౌట్ కు వచ్చేయాల్సిందిగా పిలవడం.. నిబంధనలకు విరుద్దంగా అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే మైదానంలోకి వెళ్లడం వివాదాస్పదం అయింది.
అయితే ఈ ఘటనపై చర్యలు మొదలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు రిషభ్ పంత్ కు మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత పడింది. అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేపై ఒక మ్యాచ్ సస్పెండ్ చేశారు. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ సెంచరీతో 222 రన్స్ చేస్తే… డీసీ 207 రన్స్ చేసి 15 పరుగుల తేడాతో ఓడిపోయారు.