ఇరాన్ వెనక్కు తగ్గకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన రోజు వ్యవధిలో ఇరాక్ లోని గ్రీన్ జోన్ ని బలమైన రెండు రాకెట్లు తాకాయి. ఇక్కడ ప్రభుత్వ భవనాలు మరియు విదేశీయులు ఎక్కువగా ఉన్నారు. ఇరాన్ అగ్రశ్రేణి జనరల్ ఖాసేం సోలైమానిని చంపినందుకు ప్రతీకారంగా,
ఇరాకీ స్థావరాల వద్ద బాలిస్టిక్ క్షిపణులను అమెరికా మరియు ఇతర సంకీర్ణ దళాల వద్ద ప్రయోగించిన దాదాపు 24 గంటల తరువాత ఈ దాడి జరిగింది. ట్రంప్ అలా హెచ్చరించారో లేదో అమెరికాను లక్ష్యంగా చేసుకుంది ఇరాన్. దీనిని అమెరికా అధికారిక భవనం వైట్ హౌస్ ధృవీకరించింది. తమ సైనికులు క్షేమంగా ఉన్నారని వైట్ హౌస్ పేర్కొంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఎం జరుగుతుందో అనే ఆందోళన పశ్చిమ దేశాల్లో వ్యక్తమవుతుంది.
ఇరాన్ దారికి రాకపోతే మాత్రం కఠిన చర్యలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. అయినా సరే ఇరాన్ వెనక్కు తగ్గలేదు. కచ్చితంగా తాము పగ తీర్చుకుంటామని అమెరికా ఇరాక్ ను వదిలి వెళ్ళే వరకు కూడా తాము వదిలేదని ఇరాన్ హెచ్చరిస్తుంది. అమెరికా బలగాలు బాగ్దాద్ తో పాటు పశ్చిమ ఆసియా నుంచి వెళ్ళిపోవాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. అమెరికా హెచ్చరించినా ఇరాన్ వెనక్కు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తుంది.