పెళ్లి సందర్భంగా పెళ్లికొడుకు, పెళ్లికూతరు డ్యాన్స్ చేయడం ఈ మధ్య కామన్ అయింది. ఒక్కోసారి వారు చేసే డ్యాన్స్ నెట్టింట వైరల్ గా మారిన సందర్భాలు లేకపోలేదు. ఇటీవల తెలంగాణలో బుల్లెట్ బండి సాంగ్ కు ఓ పెళ్లిలో పెళ్లి కూతరు చేసిన డ్యాన్స్ ఎంత వైరల్ అయిందో తెలిసింది. ఇదే తరహాలో దేశవ్యాప్తంతా వెడ్డింగ్ డ్యాన్స్ లు వైరల్ అయ్యాయి. ఇది మన దేశం సంగతి. ఇదే కనుక కొన్ని ముస్లిం దేశాల్లో చేసుకుంటే మాత్రం.. తీవ్ర పరిస్థితులు ఎదురయ్యేవి. ఇందుకు ఉదాహరణే ఇరాక్ లో జరిగిన ఈ ఘటన.
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఓ పెళ్లిలోనే భార్యకు విడాకులు ఇచ్చేశాడు భర్త. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటో తెలుసా.. డ్యాన్స్ చేయడం. పెళ్లి వేడుకల్లో భాగంగా పెళ్లి కూతురు ‘‘ నీపై నేనే ఆధిపత్యం చెలాయిస్తా.. నేను చెప్పినట్లు వినాలి’’ అనే అర్థం వచ్చే డ్యాన్స్ చేసింది. దీంతో పెళ్లి కొడుకుకు ఎక్కడో కాలినట్లు ఉంది. దీంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని.. పెళ్లిలోనే పెళ్లి కూతురుకు విడాకులు ఇచ్చేశాడు. ఆ దేశంలో అత్యంత తొందరగా తీసుకున్న విడాకులు ఇవే అంటూ మీడియా పేర్కొంది.