ఎన్నో రకాల ప్యాకేజీలను IRCTC అందిస్తోంది. అయితే తాజాగా రామాయణ యాత్ర ని కూడా తీసుకు వచ్చింది. ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలులో ‘శ్రీ రామాయణ యాత్ర’ చెయ్యచ్చు. భారత్ గౌరవ్ రైలును జూన్ 21న ప్రారంభించనున్నారు. ఈ యాత్ర ద్వారా రామాయణ సర్క్యూట్‌లోని శ్రీరాముని జీవితానికి సంబంధించిన అన్ని ప్రదేశాలను కూడా చూసి వచ్చేయచ్చు.
నేపాల్ జనక్‌పూర్‌లోని రామ్ జానకి ఆలయాన్ని కూడా ఈ టూర్ లో భాగంగా చూడచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. 18 రోజుల పాటు యాత్ర ఉంటుంది. ఈ రైలు లో మొత్తం 600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. రైలులోనే ఆహార పదార్థాలను తయారు చేసి ప్రయాణికులకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం శాఖాహారం మాత్రమే. ఈ రైలు మొదట శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో మొదట ఈ రైలు ఆగుతుంది.
శ్రీరామ జన్మభూమి ఆలయం తో పాటు శ్రీ హనుమాన్ ఆలయం, నందిగ్రామ్‌లోని భారత్ మందిర్‌లను చూడచ్చు. నెక్స్ట్ బీహార్‌లోని బక్సర్‌కు వెళ్తుంది. మీరక్కడ శ్రీ విశ్వామిత్ర ఆలయాన్ని చూడచ్చు. తర్వాత సీతా జన్మస్థలం ఉన్న సీతామర్హికి రైలు వెళ్తుంది. నేపాల్‌లోని జనక్‌పూర్‌లోని రామ్ జానకీ ఆలయాన్ని తరవాత చూడచ్చు.
అదే విధంగా కాశీలోని ప్రముఖ ఆలయాలన్నింటినీ చూపిస్తారు. శృంగవర్పూర్, చిత్రకూట్‌కు వెళ్తారు. చిత్రకూట్ నుంచి నేరుగా నాసిక్‌కు చేరుకుంటారు. హంపి, రామేశ్వరం, కాంచీపురంలోని ఆలయాలను చూసాక భద్రాచలానికి వెళ్తారు. భద్రాచలంలో దర్శనం పూర్తైన తర్వాత ఢిల్లీ వెళ్తుంది రైలు. దీనితో టూర్ ముగుస్తుంది. భారత్ గౌరవ్ రైలు రామాయణ యాత్ర కింద దాదాపు 8000 కిలోమీటర్ల ప్రయాణిస్తుంది. మొత్తం 18 రోజుల ప్రయాణానికి రూ. 62370/- కట్టాలి. 3, 6, 9, 12, 18 , 24 నెలల వాయిదాలలో ఈ డబ్బు పే చెయ్యచ్చు.