IRCTC : వైజాగ్-అరకు హాలిడే ప్యాకేజీ… వివరాలు మీకోసం..!

-

అరకు వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఈ టూర్ ప్యాకేజీ. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎన్నో రకాల టూర్ ప్యాకేజీలని తీసుకు వస్తుంది. ఇప్పుడు విశాఖపట్నం నుంచి అరకు టూర్ ప్యాకేజీని తీసుకు వచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. వైజాగ్-అరకు హాలిడే ప్యాకేజీ పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ టూర్ మొత్తం 2 రాత్రులు, 3 రోజులు ఉంటుంది. హైదరాబాద్ లేదా ఇతర ప్రాంతాల నుంచి వైజాగ్ వచ్చినవారు అరకు వెళ్లాలనుకుంటే ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.

 

ఇలా ఈజీగా అరకు చూసేయచ్చు. ఈ టూర్ విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్టాండ్ చేరుకున్న తర్వాత స్టార్ట్ అవుతుంది. ఐఆర్‌సీటీసీ వైజాగ్-అరకు హాలిడే ప్యాకేజీ ప్రారంభ ధర రూ.6,160. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.8610, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.15,730 చెల్లించాలి
ఈ టూర్ ద్వారా వైజాగ్, అరకులోని పర్యాటక ప్రాంతాలు చూడచ్చు. ఇక ఈ టూర్ గురించి మరిన్ని వివరాలని చూస్తే..

మొదటి రోజు పర్యాటకులను వైజాగ్ ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్టాండ్ దగ్గర ఐఆర్‌సీటీసీ సిబ్బంది రిసీవ్ చేసుకుంటారు. తోట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, రామానాయుడు ఫిలిమ్ స్టూడియో, రుషికొండ బీచ్ చూడచ్చు. లంచ్ చేసాక.. కైలాసగిరి, సబ్‍మెరైన్ మ్యూజియం, బీచ్ రోడ్, ఫిషింగ్ హార్బర్ చూసి నైట్ వైజాగ్ లోనే స్టే చెయ్యాలి.

రెండవ రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత అరకు బయల్దేరాలి. దారిలో తైడా జంగిల్ బెల్స్, పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం చూసి.. మధ్యాహ్న భోజనం తర్వాత అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా కేవ్స్ చూసాక సాయంత్రం తిరిగి విశాఖపట్నం బయల్దేరాలి. రాత్రికి విశాఖపట్నంలోనే స్టే ఉంటుంది. మూడవ రోజు బ్రేక్ఫాస్ట్ అయ్యాక డ్రాప్ చేసేస్తారు. టూర్ ముగుస్తుంది. టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం, ప్యాకేజీ బుక్ చేయడానికి https://www.irctctourism.com/ వెబ్‌సైట్ చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version