వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ 2023 : పాల్ స్టిర్లింగ్ భారీ సెంచరీ..

-

వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ 2023 లో భాగంగా మరో మ్యాచ్ లో ఐర్లాండ్ మరియు యూఏఈ లో తలపడుతున్నాయి. గ్రూప్ బి లో ఉన్న ఈ రెండు జట్లు ఇప్పటికే లీగ్ నుండి నిష్క్రమించాయి. అయితే తమ సత్తాను చూపించడానికి ఈ మ్యాచ్ చివరిది అని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ లకన్నా మెరుగ్గా ఆడిందని చెప్పాలి. సీనియర్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ ఈ ఇన్నింగ్స్ లో చెప్పుకోదగిన ఇనింగ్స్ ఆడాడు. మొదటి నుండి ఆచితూచి ఆడుతూ వచ్చిన స్టిర్లింగ్ (162) సెంచరీ మైలు రాయిని అందుకున్నాడు.

ఇతని ఇన్నింగ్స్ లో మొత్తం 15 ఫోర్లు మరియు 8 సిక్సులు ఉన్నాయి. ఇంకా నాలుగు ఓవర్ లు మిగిలి ఉండగానే స్టిర్లింగ్ అవుట్ అయ్యాడు. లేదంటే డబుల్ సెంచరీ చేసే అవకాశం ఉండేది.

Read more RELATED
Recommended to you

Exit mobile version