ఆ యువ ఎమ్మెల్యేకు జగన్ షాక్..టీడీపీ సీనియర్‌పై కొత్త అభ్యర్ధి?

-

వచ్చే ఎన్నికల్లో మరొకసారి గెలుపు బాటలో వెళ్లడానికి జగన్ రకరకాల వ్యూహాలతో ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో టి‌డి‌పిని చిత్తుగా ఓడించి సత్తా చాటిన జగన్..ఈ సారి కూడా అదే తరహాలో వ్యూహాలు పన్నుతున్నారు. అభ్యర్ధుల విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నారు. గత ఎన్నికల్లో టి‌డి‌పి కోటలని కూల్చి సత్తా చాటారు. ఈ సారి కూడా అదే తరహాలో విజయం అందుకోవాలని చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలని మార్చి బలమైన అభ్యర్ధులని బరిలో దించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు సీటు లేదని జగన్ తేల్చి చెప్పేశారు. అలా వ్యతిరేకత ఉన్న వారిలో పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ కూడా ఉన్నారని వైసీపీ అంతర్గత చర్చల్లో బయటకొస్తుంది. గత ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేసి..టి‌డి‌పి సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తిని ఓడించారు. జగన్ గాలిలో అదీప్ మంచి విజయం అందుకున్నారు.

ఇలాంటి విజయం అందుకున్నప్పుడు ఇంకా బాగా పనిచేసి ప్రజల మద్ధతు కూడబెట్టుకుంటే..రాజకీయంగా బలం పెరుగుతుంది. కానీ అదీప్ అలా చేసినట్లు లేరు. పైగా అదీప్ ఫ్యామిలీ అక్రమాలకు పాల్పడిందనే విమరసలు వచ్చాయి. ఇటు అదీప్ సరైన పనితీరు కనబర్చలేదని తెలిసింది. దీంతో నెక్స్ట్ అదీప్‌ని పక్కన పెట్టి..పెందుర్తి సీటు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబుకు ఇస్తారనే ప్రచారం వస్తుంది.

2009లో ఈయన పెందుర్తి నుంచి ప్రజారాజ్యం తరుపున గెలిచారు. 2014లో టి‌డి‌పి నుంచి ఎలమంచిలిలో గెలిచారు. 2019 లో ఓటమి పాలై..ఆ తర్వాత టి‌డి‌పిని వదిలి వైసీపీలోకి వచ్చారు. అనకాపల్లి పార్లమెంట్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పెందుర్తిలో రాజకీయంగా బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పంచకర్లకు సీటు ఇస్తారని ప్రచారం వస్తుంది. బండారుకు పంచకర్ల చెక్ పెడతారని భావిస్తున్నారు. చూడాలి మరి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్‌ని కాదని పంచకర్లకు సీటు ఇస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version