ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో అక్రమాలు.. ప్రభుత్వ టీచర్, విద్యార్థిని ఎంపిక

-

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాలుగు పథకాలు తప్పుదారి పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలోని ఓ గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు కింద అర్హులను ఎంపిక చేసి నాలుగు పథకాలను అమలు చేస్తున్నారు. అయితే, కింది స్థాయి కాంగ్రెస్ లీడర్లు, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై అనర్హులను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.

CM Revanth Reddy

ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, విద్యార్థిని ఎంపికైనట్లు సమాచారం.మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై అనర్హులను ఎంపిక చేసి మంజూరు పత్రాలను అందజేశారు.ఈ విషయంపై ఎంపీడీఓ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఉపాధ్యాయుడి కుటుంబాన్ని ఆత్మీయ భరోసా పథకం కింద ఎంపిక చేసిన విషయం వాస్తవమేనన్నారు.విచారణ నివేదికను కలెక్టర్‌కు పంపించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news