శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు !

-

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ లో కలకలం. మరోసారి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సైబరాబాద్ కంట్రోల్ రూంకు ఫోన్ చేశాడు ఓ అగంతకుడు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ ఉందని బెదిరించాడు. దీంతో… అప్రమత్తమై ముమ్మర తనిఖీలు చేసిన ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీ…. చెకింగ్‌ చేసింది.

shamshabad airport

అయితే… బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని తేల్చేశారు ఎయిర్ పోర్ట్ అధికారులు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి కామారెడ్డి వాసిగా గుర్తించారు.. నిందితుడిని విచారించారు పోలీసులు. ఫేక్ కాల్ చేసిన నిందితుడికి మతిస్థిమితం సరిగా లేదని తేల్చేసారు అధికారులు. దీంతో… శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు లేవని ప్రయాణికులు రిలాక్స్‌ అయ్యారు. ఇక ఈ సంఘటన ఇప్పుడు వైరల్‌ గా మారింది. కాగా… ఇలా ఇప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబులు ఉన్నాయని చాలా సార్లు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news