తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వరుసగా సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వరుసగా అన్ని పార్టీల్లో కీలక సంఘటనలు చోటు చేసుకుంటున్న వేళ త్వరలో మరిన్ని పార్టీలు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు కొత్తగా షర్మిల పార్టీ కూడా వచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే. కాగా వీటన్నింటికీ డిఫరెంట్‌గా బహుజన నిదాదమే లక్ష్యంగా త్వరలోనే రాజకీయ పార్టో రాబోతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఉన్న అన్ని పార్టీలు కూడా బహుజనులకు ఎలాటి న్యాయం చేయలేదనే కారణంగా ఇప్పుడు కొత్తగా తీన్మార్ మల్లన్న ఇదే వాయిస్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకోసం మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆకునూరి మురళితో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
అలాగే మరో వ్యక్తి అయిన ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ కూడా ఇదే దారిలో పయనిస్తున్నట్టు తెలుస్తోంది. ఈయన రీసెంట్ గానే తన ఐపీఎస్ పదవికి వీఆర్ ఎస్ ద్వారా రాజీనామా చేశారు. ఈయన ఇప్పటికే స్వేరో టీమ్‌లతో గురుకులాలను ఎంతో పటిష్టంగా మార్చి చాలా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఇమేజ్ ఉన్న నేతగా ఈయనకు గుర్తింపు ఉంది. ఈయన కూడా త్వరలోనే బహుజన పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం త్వరలోనే రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కలిసి ఏర్పాటు చేస్తారా లేక విడివిడిగా చేస్తారా అన్నది మాత్రం చూడాలి.