టోక్యో ఒలింపిక్స్: భారత బాక్సర్ మేరీకోమ్ శుభారంభం

-

టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు చాలా ధీటుగా రాణిస్తున్నారు. తాజాగా భారత సీనియర్‌ బాక్సర్‌ మేరీకోమ్‌, టోక్యో బలింపిక్స్‌లో శుభారంభం దక్కించుకుంది. 51 కేజీల విభాగంలో జరిగిన తొలి రౌండ్‌లో డొమినిక్‌ రిప్లబిక్‌ బాక్సర్‌ మిగులినా హర్నాండేజ్‌ గ్రేసియాను 4-1 తేడాతో ఓడించిన మేరీకోమ్‌, రౌండ్‌ 16 లోకి దూసుకు వెళ్లింది.

2012 లండన్ ఒలింపిక్స్‌ లో కాంస్య పతకం సాధించిన మేరీకోమ్‌, ఆరుస్లార్లు వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ గెలిచింది. అయితే… ఈ సారి కూడా స్వర్ణ పతకం సాధించాలనే లక్ష్యంతో టోక్యో ఒలింపిక్స్‌ బరిలో దిగుతోంది. ఇక అంతకు ముందు టేబుల్‌ టెన్నిస్‌ లోనూ ఇండియా ప్లేయర్‌ మానికా బత్రా విజయం సాధించింది. తొలి రెండు సెట్లు కోల్పోయిన తర్వాత అద్భుతమైన కమ్‌ బ్యాక్‌ ఇచ్చిన మానికా బత్రా… 20 వ సీడెడ్‌ అయిన ఉక్రెయిన్‌ ప్లేయర్‌ మార్గెట్టా పెసోస్కాన్‌ 4-3 తేడాతో ఓడించి మూడో రౌండ్‌కు చేరుకుంది.  కాగా.. ఇక జులై 29 న మేరీ కోమ్‌ కొలంబియాకు చెందిన మూడో సీడ్‌ వాలెన్సియా విక్టోరియాతో రౌండ్‌ 16 లో తలపడనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version