సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన తర్వాత ఫేక్ న్యూస్ వ్యవహారం విచ్చలవిడిగా పెరుగుతోంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలపై అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఆరునెలల పాటు ఇబ్బందులు పడిన ప్రజలకి అన్ లాక్ 5.0లో భాగంగా కేంద్రప్రభుత్వం జన్ ధన్ ఖాతాదారులందరికీ 3000రూపాయలు ఇవ్వనుందంటూ యూట్యూట్ వీడియో ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టింది.
ప్రభుత్వం నుండి ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం బయటకి రానప్పటికీ జనాలు యూట్యూబ్ వీడియోని నమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, యూట్యూబ్ లో వచ్చిన వార్త ఫేక్ అని తేల్చింది. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో ఏది నిజం, ఏది అబద్ధమో ప్రజలకి తెలియచెప్పడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఒక ట్విట్టర్ అకౌంట్ ని నడుపుతుంది. దాని ద్వారానే ఈ వార్తని ఫేక్ అని తేల్చింది సో.. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద ఖాతాదారులందరికీ 300రూపాయలలు ఇస్తున్నారనే మాట అబధ్ధం.