తెలంగాణలో ముందస్తు ఎన్నికల గురించి ముందుగానే రాజకీయ రగడ నడుస్తోంది…కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ఖాయమని, ఎన్నికల్లో కేసీఆర్ ని చిత్తుగా ఓడించడం పక్కా అని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు అంటున్నాయి. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏడాది క్రితమే చెప్పేశారు…కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని..ఆ తర్వాత బీజేపీ నేతలు సైతం…కేసీఆర్ ముందస్తుకు వెళ్ళడం ఖాయమని అంటున్నారు. ఆఖరికి అమిత్ షా లాంటి వారు సైతం…కేసీఆర్ ముందస్తుకు వెళ్లడంపై మాట్లాడుతున్నారు. తాజాగా విజయమ్మ లాంటి వారు సైతం తెలంగాణలో ముందస్తు గురించి చెబుతున్నారు.
ఇక కేసీఆర్ సవాల్ పై బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్నారు….తమ నాయకుడు అమిత్ షా ఎప్పుడో చెప్పారని..ముందస్తుకు రెడీ అని, కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేయాలని అంటున్నారు..వెంటనే ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన తాము రెడీ అని బండి సంజయ్ అంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సైతం కేసీఆర్ సవాల్ పై స్పందించింది..డిసెంబర్ లో గుజరాత్ ఎన్నికలు ఉన్నాయని, దాంతో పాటే తెలంగాణ ఎన్నికలు పెట్టిస్తామని, ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేయాలని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అంటున్నారు.
అంటే ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పేస్తున్నారు…అంటే ఇప్పుడు బాల్ కేసీఆర్ కోర్టులో ఉంది…ఆయన అసెంబ్లీ రద్దు చేస్తే…గుజరాత్ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి…మరి అసెంబ్లీ రద్దు చేయడానికి కేసీఆర్ రెడీనా? కాదా? అనేది తెలియాలి.