టీడీపీలో పార్టీకి కానీ పార్టీ పదవులకు కానీ ఎవరైనా రాజీనామాలు చేసినా.. బాబు ఫోన్ చేసినప్పుడు రిసీవ్ చేసుకోకపోయినా.. జుం మీటింగులకు హాజరుకాకపోయినా.. బాబు & కోల్లో ఆందోళన మొదలైపోతుంది! వారు ఏ కారణంతో ఆ పనిచేసినా కూడా… పార్టీని వీడిపోతున్నారనే భయం మొదలైపోతుంది. తాజాగా గల్లా అరుణకుమారి పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేయడంతో రకరకాల ఊహాగాణాలు వెలుగులోకి వస్తున్నాయి!
అవును… తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రాజీనామా చేశారు. దానిపై ప్రస్తుతం వివిధ రకాల ప్రచారాలు జరుగుతుండడంతో స్పందించిన ఆమె… “టీడీపీకి పూర్వ వైభవం చేకూర్చాలంటే పొలిట్ బ్యూరో సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది.. వయోభారం కారణంగా అంత ఓపిక నాకు లేదు.. ఆ పదవికి న్యాయం చేయలేనని అధినేతకు చెప్పాను” అని వివరించారు!
అంతవరకూ బాగానే ఉంది కానీ…. ఆమె చెప్పింది నిజమైన కారణమేనా లేక తలపోటు తప్పించుకోవడానికి చెప్పిన సాకా అనేది తెలియాల్సి ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం! ఎందుకంటే… పార్టీ పదవులకు న్యాయం చేయలేమోనని రాజినామా చేస్తున్నాని చెప్పడాన్ని.. రాజకీయాల్లో హాస్యాస్పధంగా చెబుతున్నారు పండితులు! పదవి చిన్నదైనా పెద్దదైనా పదవి పదవే! అలాంటిది… రాష్ట్రవ్యాప్తంగా తిరగాలి కాబట్టి, ఓపిక లేదు కాబట్టి వదిలేస్తున్నాను అంటే నమ్మేలా లేదనేది వారి వాదన!
ఎందుకంటే… పార్టీకి పూర్వ వైభవం చేకూర్చాలంటే పొలిట్బ్యూ రో సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నిజాలు మాత్రమే మాట్లాడుతూ ప్రజల్లోకి వస్తే చాలు! చినబాబు దాక్కుని ఆన్ లైన్ లో ఆటలు ఆడకుండా… జనాల్లో తిరిగితే చాలు అనేది మరికొందరి అభిప్రాయం!! ఈ లెక్కన చూసుకుంటే… గల్లా అరుణ రాజినామా చేయడానికి చెప్పిన విషయం నిజంగా ఒక కారణమేనా లేక సాకు చెప్పార? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాలి మరి!!
-CH Raja