జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఆయన సోదరుడు జనంపల్లి దుష్యంత్ రెడ్డి చెరువునే కబ్జా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జడ్చర్ల పట్టణం నడిబొడ్డున ఉన్న నల్లకుంటలో 4 ఎకరాల భూమిని కబ్జా చేసి మట్టి పోసి, కాంపౌండ్ కట్టినట్లు సమాచారం.
ఆక్రమణలను తొలగించాలని హైకోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పట్టించుకోవడం లేదని సమాచారం. హైకోర్టు ఆర్డర్లను బేఖాతర్ చేస్తూ కబ్జా చేసిన భూమిలో ఎమ్మెల్యే, ఆయన అన్న దుష్యంత్ రెడ్డి నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ఆ కబ్జా భూమి FTL పరిధిలో ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిసింది. హైదరాబాద్‌లో చెరువుల కబ్జాల గురించి హైడ్రాకి ఫిర్యాదు చేసే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి..సొంత నియోజకవర్గంలోని నల్లకుంటను తన అన్న కబ్జా చేయడం కనిపించడం లేదా? అంటూ జడ్చర్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏకంగా చెరువు నే మింగిన జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల పట్టణం నడిబొడ్డున ఉన్న నల్లకుంటలో 4 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్న జనంపల్లి దుష్యంత్ రెడ్డి మరియు అనిరుధ్ రెడ్డి అనుచరులు
ఆక్రమణలను తొలగించాలని హైకోర్టు ఆర్డర్లు ఇచ్చినా… pic.twitter.com/dalaEHo7Ey
— Telugu Scribe (@TeluguScribe) March 21, 2025