అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ను ఓ ఆట ఆడుకుంటున్నారు. పింఛన్ 4,000 రూపాయలు ఎప్పుడయితదా అని ఎదురుచూస్తూ కొందరు వృద్ధులు కాలం చేశారని చురకలు అంటించారు. రూ. 4,000 పింఛన్ ఎప్పుడిస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
గత బడ్జెట్ లో చెప్పినట్లు రైతులకు రూ. 31 వేల కోట్ల రుణమాఫీ ఏమైంది? ఎకరానికి రూ. 15 వేల రైతు భరోసా ఏమైంది? కౌలు రైతులకు రైతు భరోసా, రైతు బీమా ఏమైంది? అని నిలదీశారు. అందినకాడికి అప్పులు చేసుడు.. విచ్చలవిడిగా భూములు అమ్ముడు.. ఇదేనా కాంగ్రెస్ మార్క్ పాలన? అని మండిపడ్డారు.