విశాఖ రాజధానికి “కళా” మద్దతిస్తున్నట్లేనా?

-

టీడీపీ (ప్రస్తుత) అధ్యక్షుడు కళా వెంకటరావు స్వేఛ్చా జీవి కాబోతున్నారనే కామెంట్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి! పార్టీ అద్యక్ష బాధ్యతల నుంచి కళా ను తప్పించబోతున్నారనే కథనాల నేపథ్యంలో కళా అలా అలిగారని అంటున్నారు! సమాచారం మేరకు… ఈ పదవినుంచి తనను తప్పించాల్సినంత అవసరం ఏమిటి అనేది ఆయన సెల్ఫ్ క్వశ్చన్ అంట!

అవును… ఇప్పుడు ఏపీలో టీడీపీ ది మునుగుతున్న నావ పరిస్థితి అని విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో.. దాన్ని ఖండించే ఆలోచన కానీ, అందుకు అనువైన కార్యక్రమాలు కానీ పార్టీ ఎక్కడా చేస్తోన్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో… ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉంటుందా ఊడుతుందా అనే ఊహాగాణాల నేపథ్యంలో… ఈ పధవి ఊడదీయాలనేటంత అవసరం ఏముంది అనేది కళా ఆలొచన అంట!

ఇదే క్రమంలో స్థానికంగా కూడా కళా వైభవం మనగబారుతున్న పరిస్థితులు. దానికి కారణం… గత ఏడాది ఎన్నికల్ల్లో దారుణంగా ఓడిపోవడంతో పాటు ఈ ఏడాది స్థానిక ఎన్నికలు జరగడానికి ముందే తన సొంత నియోజకవర్గంలో అన్ని సీట్లూ వైసీపీకి ఏకగ్రీవమైపోవడం! దీంతో ఈ సమయంలో జై అమరావతి, జై చంద్రబాబు అనేకంటే… ముందుగా ఉత్తరాంధ్ర ప్రజలకు అనుకూలంగా విశాఖ రాజధాని విషయంలో అనుకూలంగా మాట్లాడలేకపోయినా.. కనీసం వ్యతిరేకంగా అయినా మాట్లాడకుండా ఉండాలని ఆలోచిస్తున్నారంట.

ఈ నిర్ణయం అటు పార్టీ దగ్గర అలిగినట్లు ఉండటంతోపాటు.. ఇటు స్థానికంగా కాస్త పలుకుబడి కాపాడుకున్నట్లు అయినా అవుతుందని ఆలొచన అంట. కళా కళాకారులే అన్న మాట!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version