చాక్లెట్స్ లా డ్రగ్స్ అమ్మేస్తున్న మమ్మీ…!

-

దేశ రాజధాని ఢిల్లీలో 33 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆమె నుంచి హెరాయిన్ భారీగా స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో 30 లక్షల స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ విషయాన్ని గురువారం ప్రకటించారు. నిందితురాలిని మాడిపూర్ నివాసి సంధ్యగా గుర్తించినట్లు వారు మీడియాకు వివరించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడే మహిళ గురించి సమాచారం అందుకుని నిఘా పెట్టారు.

ఒక మహిళ పశ్చిమ ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతానికి హెరాయిన్ సరఫరా కోసం వస్తుందని పోలీసులకు సమాచారం అందిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఉచ్చు పన్ని ఆమెను పట్టుకున్నామని అధికారులు వివరించారు. ఆమె ఫ్యామిలీపై అక్రమ మద్యం అమ్మిన కేసులు కూడా ఉన్నాయి. ఆమె మంగోల్‌పురిలోని ఒక వ్యక్తి నుండి హెరాయిన్ సేకరించి విక్రయిస్తుంది. సంధ్యకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version