కేటీఆర్ ఏమైనా ముఖ్యమంత్రా? అరెస్టుకు గవర్నర్ పర్మిషన్ ఎందుకు : ఎంపీ అర్వింద్

-

ఫార్ములా ఈ రేసు నిధుల గోల్‌మాల్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్టు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు టైం పాస్ చేస్తోందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శించారు. కేటీఆర్‌పై విచారణకు ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరడం హస్యాస్పదంగా ఉందన్నారు. కేటీఆర్ ఏమైనా ముఖ్యమంత్రా, మంత్రి కూడా కాదని..ఓ సాధారణ ఎమ్మెల్యేకు గవర్నర్ అనుమతి అక్కర్లేదని వ్యాఖ్యానించారు.

లగచర్లలో కలెక్టర్‌పై దాడి కల్వకుంట్ల కుటుంబం చేయించిన పనేనని ఆరోపించారు.కేటీఆర్‌ది మేకపోతు గాంభీర్యమని అరెస్ట్ చేసి జైల్లో పడేయాలన్నారు.ఇక మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తోందని, అదే పాతబస్తీకి వెళ్లి సీఎం రేవంత్‌ ఒక్క బిల్డింగ్‌ను అయినా కూల్చే దమ్ముందా? అని ఎంపీ ధర్మపురి అర్వింద్ సవాల్ విసిరారు.యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్‌కు..రేవంత్‌రెడ్డి బుల్డోజర్‌కు చాలా తేడా ఉందని అన్నారు.కావాలనే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ను పూర్తిగా దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news