కొందరు అన్ని పనులు ఒకేసారి చేస్తుంటారు. మరికొందరు తమకు అప్పగించిన పనిచేయడానికే ముప్పతిప్పలు పడతారు. మల్టీటాస్క్ చేసేవాళ్లంటే..వాళ్లు బాగా ఆరోగ్యంగా ఉన్నారని..యాక్టీవ్ గా అన్నీ ఒకేసారి చేస్తారని మనం అనుకుంటాం. కానీ శక్తికి మించిన బాధ్యతలు చేయటం మానసిక స్థితికి అనర్థం. మనలో ఆ సామర్థ్యం లేదంటే..చాలా సమస్యలు వస్తాయి. బ్రెయిన్ డిప్రషన్ కు గురువతారు. ఒత్తిడికి లోనవుతారు. ప్రశాంతంగా ఉండలేరు. ఈరోజు మల్టీటాస్కింగ్ చేయటం వల్ల ఇంకా ఎలాంటి అనర్థాలు జరుగుతాయో చూద్దాం.
ఉద్యోగం చేస్తే.. ప్రశాంతంగా ఉద్యోగమే చేసుకుంటే… హాయిగా ఉంటుంది. కానీ.. ఉద్యోగంతోపాటు.. పెట్టుబడులు, వ్యాపారాలు లాంటివి కూడా చేస్తన్నారంటే..ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఇన్నీ చేసేసరికి.. కొందరు మాత్రమే అన్నింటిని బ్యాలెన్స్ చేయగలగుతారు. కానీ చాలామంది ఎదుటివారని చూసి.. మనం కూడా అలానే చేయాలని వీళ్లుకూడా మొదలుపెడతారు. కానీ వీళ్ల బ్రెయిన్ స్టేటస్ కి ఆరోగ్యానికి అవి సెట్ కావు. కుటుంబానికి, ఉద్యోగానికి, ఇతర పనులకు అన్నింటికి న్యాయం చేయలేరు. ఒత్తిడి ఎక్కువైపోతుంది. నిద్రపట్టదు. అప్పుడు ఆల్కాహాల్ కు బానిసవుతారు.
బ్రెయిన్ మీద ఒక గ్రేమాటర్ ప్రొటెక్టివి లేయర్ ఉంటుంది..ఈ మల్టీటాస్కింగ్ చేసే స్ట్రస్ వల్ల బ్రెయిన్ కుశించుకోపోతుందని సింగపూర్ వాళ్లు సైంటిఫిక్ అధ్యయనం చేసి నిరూపించారు. 2016 వ సంవత్సరంలో అమెరికావారు మరొక పరిశోధన చేసి…. సామర్థ్యం లేకపోయినా పక్కనవాళ్లను చూసి ముందుకెళ్లటం వల్ల వచ్చే మానసిక ఒత్తిడి వల్ల బ్రెయిన్ సెల్స్ డామేజ్ అవుతున్నాయి. మెమరీలాస్ అనేది మల్టీటాస్కింగ్ చేసేవాళ్లలో ఎక్కువగా ఉందని సైంటిస్టులు ప్రూవ్ చేశారు.
హార్మోన్ ఫ్లక్యువేషన్స్ ఎక్కువగా వస్తున్నాయట. సరైన నిద్రలేక..బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ ఓవర్ వెయిట్ కు, ఆహారం తిన్నా అరగపోవడానికి, డయబెటీస్ రావడానికి, బీపీ రావడానికి, హార్ట్ కు సంబంధించిన ఇష్యూస్ రావడానికి కారణాలుగా మారుతాయి. దీంతోపాటు చూస్తే బోన్ వీక్ నెస్ కూడా ఈ మల్టీటాస్కింగ్ చేసేవారిలో ఎక్కువగా వస్తుందట.
ఈ స్ట్రస్ టెన్షన్ ఎక్కువైనప్పుడు బ్లడ్ లో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఇవి బ్లడ్ ని యసిడిక్ మారుస్తాయి. యసిడిక్ బ్లడ్ ని న్యూట్రలైజ్ చేయడానికి బోన్స్ లో ఉండే కాల్షియం బయటకువచ్చేస్తుంది. ఎముకలు గుల్లబారిపోతాయి. ఇట్లాంటివారికి నిద్రపట్టక నిద్రమాత్రలు వేసుకోవడం, ఆల్కాహాల్ ఎక్కువగా తాగటం, భార్యాభర్తల మధ్య సరిగ్గా రిలేషన్ లేకపోవడం మల్టీటాస్కింగ్ చేసేవారిలో ఎక్కువగా ఉంటుంది.
అనేక రంగాల్లో ఒకేసారి వేలుపెట్టకుండా..ఏ వృత్తిలో ఉన్నారో..అదే పని ప్రశాంతంగా చేసుకుని..ఇంటికివచ్చి భార్యాపిల్లలతో హ్యాపీగా ఉంటారు. కానీ మల్టీటాస్కింగ్ చేసేవాళ్లు..ఆర్థికంగా పెరగొచ్చు కానీ..మానసికంగా, శారీరంగా చాలా లాస్ అయిపోతారని అనేక సర్వేలు నిరూపించాయి. అందుకని ఉన్నదాంట్లో సర్ధుకుని ప్రశాంతంగా గడపటంలో ఉన్నంత హాయి మరొకటి లేదు.
యూత్ లో మల్టీటాస్కింగ్ చేయడం వల్ల వచ్చే నష్టాలేంటి
20-25 సంవత్సరాలలోపు వారికి ఇంట్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వాళ్లు అన్ని చేస్తున్నారు నువ్వు ఏం చేయడంలేదేంటి అని బాగా పిల్లలను పదేపదే విసిగిస్తుంటారు. కాలేజ్ డేస్ లో కొంతమంది.. చదువుతోపాటు.. యోగా, మ్యూజిక్, డ్యాన్స్, సంఘసేవ, జిమ్ ఇలాంటివి చేస్తుంటారు. మన పిల్లలు కూడా ఏదోఒకదాంట్లో నైపుణ్యం పొందాలని తల్లిదండ్రులు అనుకోవడంలో తప్పులేదు.. కానీ మన పిల్లలకు ఆ సామర్థం ఉందా, ఆసక్తి ఉందాలేదా అని తెలుసుకోవాలి.. కానీ చాలామంది పేరెంట్స్ ఇది తెలుసుకోకుండా.. వాళ్లలాగా నువ్వెందుకు చేయటంలేదు.. వేస్ట్ అని నిరుత్సాహపరుస్తుంటారు. వీళ్లగోల తట్టుకోలేక మనోడు వెళ్లినా.. అటు చదువు ఇటు ఈ ఎక్స్ట్రా యాక్టివీ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోలేడు. కాబట్టి పేరెంట్స్ ఈ ఏజ్ లో ఉన్నవారిని ఇలా ఒత్తిడికి గురిచేయకూడదు. ర్యాంక్ సాధించాలని కూడా పదేపదే ప్రజర్ చేయకూడదు.. ఇంత ఖర్చుపెట్టాం కచ్చితంగా మంచిమార్కులు తెచ్చుకోవాలనే ధోరణిలోనే ఉంటారు.. ఈ ప్రజర్ అంతా.. తట్టుకోలేక స్టూడెంట్స్ సూసైడ్స్ చేసుకుంటారు. ఇలాంటి ఘటనలు కూడా కోకకల్లలే.
కొంచెం ఆలోచించండి..సామర్థ్యాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని మంచి డైరెక్షన్ లో వెళ్లాలి…ఏదైనా మనం సాధించాలి అంటే..ఫిజికల్ గా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఒత్తిడి ఉండకూడదు. టెన్షన్, స్ట్రస్ , డిప్రషన్ కు గురవడం అస్సలు మంచిదికాదు..ఇవి రాకుండా మీరు ఎన్నిపనులు అయినా చేయొచ్చు. ఎప్పుడు అయితే..ఇవి మీ జీవితంలోకి ఎంటర్ అవుతున్నాయో అప్పుడు ఆ పనులకు గ్యాప్ ఇవ్వడమే..వదిలేయడమో చేయండని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు అంటున్నారు.